Connect with us

Andhra

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చైర్ పర్సన్‌గా డాక్టర్ షేక్ మహబూబ్ వలి నియామకం..

Published

on

ఉమ్మడి జిల్లా మైనార్టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలికి మరో పదవి వరించింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చైర్ పర్సన్‌గా లైఫ్ టైమ్ పదవిని ఆయనను నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక నియామక పత్రాన్ని ఆయన స్వీకరించారు. సమాజ సేవ, మానవ హక్కుల పరిరక్షణ, పేదల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషిని గుర్తించిన సంస్థ ప్రతినిధులు ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

డాక్టర్ షేక్ మహబూబ్ వలి ప్రస్తుతం ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తూ, పలు జాతీయ స్థాయి సంస్థల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, కరప్షన్ ఫ్రీ ఇండియా, యోగ్దానం సహర సమితి ఆఫ్ ఇండియా, స్వర్ణిం భారత్ సమాజ్ కళ్యాణ్ ఫౌండేషన్ వంటి నాలుగు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, మైనార్టీల హక్కుల పరిరక్షణ, అవినీతికి వ్యతిరేక పోరాటం, పేదలకు న్యాయం కల్పించడం వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక బాధ్యతను సంస్థ అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ నియామకం పట్ల పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.