Connect with us

Andhra

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులుగా పిన్నిక శివ నియామకం పట్ల అభినందనల వెల్లువ..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నూతన కమిటీ సభ్యులుగా పిన్నిక శివ నియామకం జరిగింది.

ఈ సందర్భంగా పిన్నిక శివ మాట్లాడుతూ..ఈ పదవి నియామకానికి సహకరించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పిన్నిక శివ మార్కాపురం పట్టణ BC సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తెలుగు దేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన పిన్నిక శివకు ఈ పదవి వరించడం పట్ల పిన్నిక శివ మిత్ర మండలి సభ్యులు హనీష్, మహేష్, లక్ష్మి రెడ్డి, కాశి రెడ్డి, మండ్ల శ్రీను, మాలాంటి సుబ్బారెడ్డి, దొండపాటి, దూదేకుల నాగూర్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.