Connect with us

Andhra

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆకస్మిక తనిఖీ చేసిన జేసి..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గురువారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లోని మరుగు దొడ్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. బస్టాండ్ ఆవరణలో టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ డిఎం లావణ్యకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ లో మరుగు దొడ్లకు10 రూపాయలు తీసుకుంటున్నారని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్.టి.సి అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఆర్.టి.సి డి.ఎం లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.