Connect with us

Andhra

పవన్ కళ్యాణ్ పై వై పాలెం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించిన సయ్యద్ సాదిక్…

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి జనసేన పార్టీనీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని మరియు జనసేన నాయకులపై విమర్శించిన ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ పై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ.. వైసిపి ఎమ్మెల్యే చంద్రశేఖర్ పని పాట లేకుండా మీడియా ముందు కాలయాపన చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యేగా మీరు మీ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడారా అని ప్రశ్నించారు.? ప్రజా సమస్యలను మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి భజన మాత్రమే చేస్తూ తప్పుడు విధానాలను ఎంచుకొని ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ మీద విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో కూడా మీరు జనసేన పార్టీ మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం జరిగిందని, అప్పుడు కూడా స్పష్టంగా పద్ధతి కాదని చెప్పడం జరిగిందన్నారు.

మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మీకే కాదు మాకు కూడా వస్తుంది ఆ విధంగా మేము మాట్లాడితే ఈ ప్రాంతంలో తిరగలేరని గుర్తుంచుకోవాలన్నారు. పదే పదే తప్పుడు ప్రచారం ప్రజలను తప్పుదో పట్టిస్తే సహించేది లేదన్నారు. గత ప్రభుత్వంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మహిళలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అందరికీ తెలుసని, అందుకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదని విమర్శించారు. జనసేన పార్టీ అదొక పార్టీయా అన్న మీకు ప్రభుత్వం ఏర్పడడానికి జనసేన పార్టీ ముఖ్య భూమిక పోషించిన విషయం మీకు తెలియదా అన్నారు. రాజకీయంగా మాట్లాడండి పాలనపరంగా ఏమన్నా లోపాలు ఉంటే చూపండి అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోండి అని హితవు పలికారు. వైయస్సార్ పార్టీ ఏమైనా మీ ప్రభుత్వం వస్తుందని కలలగంటున్నారా అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పార్టీలను విమర్శించడం మానుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బి కొండల్ ప్రజాపతి, డి కాశిం, దుమ్మని చందు, షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.