Connect with us

Andhra

మాలల ఐక్యత, అభివృద్ధి కోసమే కమిటీలు..తుల్లిబిల్లి అశోక్ బాబు..

Published

on

మార్కాపురం జిల్లా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ప్రమాణం చేయించిన రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు…

మాలలకు జరుగుతున్నటు వంటి విద్యా ఉద్యోగాల అన్యాయాల గురించి ఓ పత్రిక ప్రకటనలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు వివరించారు. మార్కాపురం యొక్క ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు పర్యవేక్షణలో కొత్త కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయనతో పాటు ప్రకాశం జిల్లా జేఏసీ నాయకులు చిడితోటి శ్రీరాములు, మేడికొండ లక్ష్మీనారాయణ దాసరి ప్రసాద్ పులగర కృష్ణయ్య పాల్గొన్నారు.

కార్యక్రమంలో నూతన మార్కాపురం జిల్లా మాలల జేఏసీ, ఉద్యోగ సంఘం నాయకులను ఎన్నుకున్నారు. మార్కాపురం జిల్లా మాలల జె.ఏ.సి అధ్యక్షులుగా మాలపోలు శాంతకుమార్ ని నియమించారు, మాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా గోపనబోయిన శ్యామ్యూల్ , ప్రదాన కార్యదర్శిగా మంచా సాయి, మార్కాపురం జిల్లా ఉపాధ్యక్షులుగా గొట్టిముక్కల యోహాన్, కటికల బాలబాదుర్ల జాయింట్ సెక్రటరీగా పరదేశి శ్రీనివాసులు, కలవకూరి అబ్రహం కోశాధికారి కోండ్రు పిచ్చయ్య, ఉపకోశాధికారి వేమ శంకర్ గౌరవ సలహాదారులుగా జనుమాల నాగయ్య, పరదేశి రాజశేఖర్, కలవకూరి శాంతారాజ్ లను ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా మురారి కొండయ్య, అక్కి దాసరి చిన్నయ్య, మురారి సురేష్, శ్రీపల్లె వర ప్రసాద్, ప్రతాప్, శ్రీధర్ల బర్నబాస్ లను కార్యవర్గం సభ్యులుగా జక్కం పవన్ కుమార్, గుల్ల ఓబులు, చీదర్ల రమేష్ బాబు,గుల్ల విజయ అను వారిని నియమించడం జరిగింది.

మార్కాపురం జిల్లా మాలల జె.ఏ.సి మరియు ఉద్యోగ సంఘం నియమించిన నాయకులతో మాలల జాతి అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని అశోక్ బాబు అన్నారు. అనంతరం మార్కాపురం జిల్లా మాలల జేఏసీ,మరియు ఉద్యోగ సంఘం నాయకులను ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల మాలలు నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.