Connect with us

Andhra

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. ఆనాడు దేశ స్వతంత్రం కోసం వారు చేసిన త్యాగాల ఫలితం గానే మనం ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, 1948 జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీని సంఘ్ కార్యకర్త నత్తురం గాడ్సే హత్య చేశాడని, ఈ దినం దేశానికి చీకటి రోజని తెలిపారు. అలాగే అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరును ప్రజల హృదయాలనుంచి తొలగించాలని కుట్రలు చేస్తుందని, దీనికి ఉదాహరణ మహాత్మా గాంధీ గారి పేరున ఉన్న మన్రేగ పధకాన్ని మార్చడమేనని, రానున్న రోజుల్లో దేశ ప్రజలు బిజెపిని అధికారంలో నుంచి గద్దె దింపి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ రెహనాబాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మన్సూర్, షేక్ ఇమ్రాన్ మరియు షేక్ ఖాసిం తదితర నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.