Connect with us

Andhra

వైసీపీ అధినేతను మర్యాద పూర్వకంగా కలిసిన ఆసిఫ్ ఖాన్..

Published

on

తాడేపల్లి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా నియమితులైన ఆసిఫ్ ఖాన్ మర్యాద పూర్వకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా అసిఫ్ ఖాన్ ను వైఎస్ జగన్ అభినందిస్తూ.. రానున్న కాలంలో యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. అలాగే మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి పాటు పడాలని అన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ ఖాన్ మాట్లాడుతూ.. అధినేత జగన్ సూచించిన అంశాలపై తప్పకుండా శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలలో మంచి యాక్టివ్ గా ఉండే అసిఫ్ ఖాన్ ను యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నియమించడం పట్ల ఆయన స్నేహితులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.