Andhra
జిల్లాలో దొంగతనాల జోరు.. పోలీసులు అరికట్టేనా
మార్కాపురం: మార్కాపురం, పెద్దారవీడు తదితర మండలాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పోలీసులు మౌనంగా ఉండడంతో దొంగలు ఇష్టారాజ్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. మార్కాపురం మండలం చింతగుంట్ల సమీపంలోని పొలంలో ఉన్న దాదాపు రెండు లక్షల రూపాయలు విలువైన టేకు చెట్లను ఇటీవల దొంగతనంగా నరుక్కుపోయారు. దీనిపైన పోలీసులకు సమాచారం ఉన్నా చోద్యం చూస్తుండడం గమనార్హం. తాజాగా పెద్దారవీడు మండలం అధికార పార్టీ నాయకుడు, మాజీ టిడిపి మండలాధ్యక్షులు తడికమళ్ళ బాలుడుకి చెందిన పొలంలో ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. నిన్న మార్కాపురం పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్ నుంచి లక్ష్యంగా చేసుకుని 65 వేల రూపాయిలు కొట్టేసి జేబు దొంగలు తమ సత్తా చాటారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు జోరందుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి అరికడతారో వేచి చూడాలి.
![]()
