Andhra
ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి 50 వేల రూ” మున్సిపల్ ఉపాధ్యాయుల వితరణ..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురంలో ట్రెజరీ ఆఫీసులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఒంగోలు ప్రైవేటు హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న ప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం మార్కాపురం మున్సిపల్ పాఠశాలలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కలిసి సుమారు ₹ 50,000/- లను ట్రెజరీ ATO ఖాదర్ వలీ ద్వారా ప్రసాద్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రసాద్ కుటుంబ సభ్యుల తరుపున ATO మునిసిపల్ ఉపాధ్యాయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
![]()
