Andhra
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె ఉధృతం..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డు SBI బ్యాంకు నందు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఐటియుసి అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ బ్యాంకు ఉద్యోగుల ర్యాలీలో పాల్గొని వారానికి ఐదు రోజులు పని దినాలుగా రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐదురోజుల పని దినాలుగా చేకూర్చవలసిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంకు నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనియన్ బ్యాంకు ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దయాకర్ తోపాటు సిఐటియు జిల్లా కార్యదర్శి రఫీ అన్ని బ్యాంకి ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
![]()
