Connect with us

Andhra

MPJ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన యర్రగొండపాలెం శాఖ..

Published

on

యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.

ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్స్ డాక్టర్ సందీప్, డాక్టర్ రాము, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి మరియు స్థానిక యర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ తదితరులతో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారికి యంపీజే ఆశయాలు, లక్ష్యాలు, కార్యక్రమాల గురించి వివరించిన అనంతరం దుశ్శాలువలతో సన్మానించిన యంపీజే నాయకులు.

ఈ కార్యక్రమంలో యంపీజే యర్రగొండపాలెం శాఖ అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, యంపీజే ఫౌండర్ సభ్యులు పఠాన్ ఖాశిం ఖాన్, ఉపాధ్యక్షుడు షేక్షావలి, షేక్ అత్తార్ బాషా, సయ్యద్ యూసుఫ్, అబూబకర్, నాజ్, ఇలియాజ్, జాని బాషా తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.