Andhra
కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం టాపర్ గా షేక్ అఫీఫ..
కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటల పోటీల్లో విజేతలకు మరియు శాఖల వారిగా టాపర్లకు సర్టిఫికెట్, మెమోంటోలతో సత్కరించిన యాజమాన్యం.
సత్కరించిన వారిలో సెకండియర్ చెందిన షేక్ అఫీఫకు మొదటి సంవత్సరంలో 9.56 SGPA స్కోర్ సాధించి కాలేజీ టాపర్ గా నిలిచింది. దీంతో కాలేజీ కరెస్పాండెన్స్ మరియు సెక్రటరీ అయిన కృష్ణ చైతన్య మెమోంటో, సర్టిఫికెట్ ఇచ్చి ఘనంగా సత్కరించారు. షేక్ అఫీఫకు కాలశాల లెక్చరర్స్ మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.
![]()
