Connect with us

Andhra

కిట్స్ కళాశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురంలోని కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (KITS)లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి కళాశాల కార్యదర్శి శ్రీ కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని, విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, కఠిన శ్రమను అలవర్చుకుంటేనే దేశాభివృద్ధికి బాటలు వేయగలరని, సాంకేతిక విద్యతో పాటు సమాజానికి ఉపయోగపడే విలువాధారిత విద్యను అందించడమే కిట్స్ లక్ష్యమని పేర్కొన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ డా. వి. కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, రాజ్యాంగ విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని, విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో సమతుల్యత సాధించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగనాయకులు మరియు విద్యార్థులు దేశభక్తి పైన ప్రసంగించారు.

విద్యార్థులు ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం దేశభక్తి గీతాలు, ప్రేరణాత్మక నాటికలు ప్రదర్శించి, దేశభక్తి భావాన్ని ప్రేక్షకుల్లో రగిలించారు. అనంతరం క్రికెట్, వాలీబాల్, కబడ్డీతో పాటు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు బహుమతులు, శాఖల వారీగా, సంవత్సరం వారీగా అకడమిక్ టాపర్లను సత్కరించారు. అలాగే అధ్యాపకుల మధ్య నిర్వహించిన అంతర్గత పోటీలు, సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఉత్తమ సంప్రదాయ వస్త్రధారణ, ఉత్తమ రంగోలి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈవెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ డాక్టర్ మనోహర్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.