Connect with us

Andhra

విజయవాడ ఎంబార్కెషన్ నుంచి 545 మంది హజ్ యాత్రకు అనుమతి.. హజ్ కమిటీ

Published

on

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నందు కేంద్ర మైనార్టీస్ మరియు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుని హజ్ యాత్రకు సంబంధించి మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ జనాబ్ షేక్ హసన్ భాషా, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ మిర్జా ఆబిద్ హుస్సేన్ బేగ్ మరియు ఈవో జనాబ్ గౌస్ పీర్.

ఆంధ్రప్రదేశ్ నుండి 2026 హజ్ యాత్రకు గాను 2020 మంది యాత్రికులు బయలుదేరుతుండగా, అందులో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి బయలుదేరుటకు 345 మంది హజ్ యాత్రికులు ఇది వరకే తమ తొలి ప్రధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి బయలుదేరు హజ్ యాత్రికులకు ఒక్కొక్క యాత్రికునికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయానికి ఆకర్షితులై అదనంగా 200 మంది హజ్ యాత్రికులు విజయవాడ

ఎంబార్కెషన్ ని ఎంపిక చేసుకోవడంతో తక్షణమే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ గౌరవ మంత్రి NMD ఫారుఖ్, కేంద్ర మైనార్టీస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో మాట్లాడి అదనంగా 200 మంది హజ్ యాత్రికులను విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు బయలుదేరేటందుకు సత్వర చర్యలు చేపట్టవలసినదిగా కోరడమైనది.

ఆ దరిమిలా, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అలాగే న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రుల సూచనలు మేరకు వారి లేఖలను ఆయా మంత్రిత్వ శాఖలలో స్వయంగా అందించిన హజ్ కమిటీ.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2026 సంవత్సరం హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి ముందుగా దరఖాస్తులు చేసుకున్న 345 మంది మరియు అదనంగా దరఖాస్తులు చేసుకున్న 200 మంది అనగా మొత్తం 545 మంది హజ్ యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి బయలుదేరుటకు అవకాశం కల్పించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.