Connect with us

Andhra

బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాపిత సమ్మెకు ఏఐటియుసి మద్దతు.. రావులపల్లి రవీంద్రనాథ్

Published

on

విజయవాడ: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడానికి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నవంబర్ 27న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు రాష్ట్ర సమితి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఐఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. వారంలో ఐదు రోజుల పని వేతన ఒప్పందంలో ప్రదర్శనలో అమలు చేయనందున సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగిందని దాని వెనుక బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఏమున్నా బ్యాంకులు మాత్రమే అమలు చేస్తామని రవీంద్రనాథ్ అన్నారు. గత నాలుగేళ్లుగా బ్యాంకులో కొత్త నియామకాలు లేవని నాడు 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తే అదే పనిని నేడు లక్షల మంది మాత్రమే చేస్తున్నారు అని సిబ్బంది కొరతవల్ల ఉద్యోగులపై పని భారం విపరీతంగా పడుతుందని అందువల్ల తగిన విశ్రాంతి ఉండాలంటే ఐదు రోజుల పని విధానం ఒప్పందం ప్రకారం రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన అంగీకరించిన డిమాండ్ కోసం ఈ నెల 27న జరుగు దేశవ్యాపిత సమ్మెకు ఏఐటియుసి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రవీంద్రనాథ్ తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.