Andhra
రైల్వే ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని రైల్వే GM కు వినతి పత్రం ఇచ్చిన డాక్టర్ మహబూబ్ వలి..
మార్కాపురం: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గుంటూరు మార్కాపురం వరకు రైల్వే స్టేషన్లలోని సమస్యలను పరిశీలించెందుకు రాగా వారికి ఈ ప్రాంత సమస్యల గురించి ఉమ్మడి జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి వినతిపత్రం ఇచ్ఛి వివరించారు. అందులో ముఖ్యంగా..
1. మార్కాపురం రోడ్డు మీదుగా వెళ్లే ప్రతి ఎక్స్ ప్రెస్ మరియు సూపర్ ఫస్ట్ ట్రైన్ లో జనరల్ భోగిలను అదనంగా పెంచాలని,
2. మార్కాపూర్ రోడ్డు మీదుగా దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లడానికి కొన్ని వీక్లీ ట్రైన్ లను ప్రవేశపెట్టాలని,
3. అధునాతనమైన ఏసీ మరియు స్లీపర్ క్లాస్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని,
4. మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు అందుబాటులో ఉండేలా చేయాలని,
5. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే రూటులో ఉన్నటువంటి పొదిలి దగ్గర ఒంగోలు కర్నూలు రూట్ లో క్రాసింగ్ హాల్ట్ నీ ఏర్పాటు చేయాలని,
6.తర్లుపాడు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు నిలబడేటట్లు (స్టాప్ )ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ ప్రాంత ప్రజలు నిత్యం తమ రోజువారి జీవన ఉపాధి కోసం మరియు వైద్య పరంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తున్నందున జనరల్ బోగీలు తక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున అదనపు భోగిలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు వెయిటింగ్ హాల్ లో సరైనటువంటి వసతులు లేనందున మరియు వేటింగ్ హాల్ చిన్నదిగా ఉండటం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అప్పర్ క్లాస్, వెయిటింగ్ హాల్ మరియు స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ లో వచ్చినటువంటి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గారికి కలిసి ఈ ప్రాంతం యొక్క సమస్యలను తెలపడం జరిగింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవకి దృశ్యాలువతో సన్మానించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
![]()
