Andhra
MPJ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు యంపీజే 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.
ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ.. యంపీజే చేస్తున్న కార్యక్రమాలు సమాజ శ్రేయస్సుకు, ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, ఇలాంటి సంస్థలు ప్రజల అవసరార్ధం ఇంకా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, APWJU జిల్లా అద్యక్షులు NV రమణ, యంపీజే పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.
![]()
