Andhra
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు చేపట్టిన పోలీసులు..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు పోలీస ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణ ఎస్ఐ M సైదుబాబు ఆద్వర్యంలో కఠిన చర్యలు చేపట్టారు.
మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేశారు. మద్యం బాటిళ్లు, వ్యర్థాలు తొలగించారు. కార్ స్టాండ్ వద్ద డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, మద్యం వల్ల ప్రమాదాలు, సమాజంపై దుష్పరిణామాలు వివరించారు. మళ్లీ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
![]()
