Andhra
హైటెన్షన్ వైర్లు తొలగించి, బాధితుడికి ఆర్థిక పరిహారం చెల్లించాలని రాస్తారోకో..
మార్కాపురం: హై టెక్షన్ కరెంట్ వైర్లు తగిలి తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో ఉన్న పిల్లవాడికి నష్టపరిహారం చెల్లించాలని మార్కాపురం జిల్లా మార్కాపురం లోని కరెంట్ ఆఫీస్ ముందు రోడ్డుపై బైఠాయించి ముహమ్మద్ నగర్ వాసుల రాస్తారోకో నిర్వహించారు.
నాలుగు సంవత్సరాల పిల్లవాడికి
బిల్డింగ్ పై ఉన్న హై టెక్షన్ కరెంట్ వైర్లు తగిలి రెండు రోజుల క్రితం తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో గుంటూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తమకు నష్టపరిహారం ఇచ్చి పిల్లవాడిని కాపాడాలని మహమ్మద్ నగర్ కాలనీవాసులు ఆవేదనతో రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేశారు. గత 60 సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఈ హైటెన్షన్ కరెంట్ వైర్లను తీసేయాలని వినతి పత్రాలు ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం చేశారని, దాని పర్యవసానంగా ఐదు మరణించడం, మరో ఐదుగురికి చేతులు కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా చేతులు కోల్పోయిన పిల్లలు నిరసనలో పాల్గొనడం గమనార్హం.
కలెక్టర్ ఆఫీసుకు వెళ్లే మెయిన్ రోడ్డుపై మహిళలు, కాలనీ వాసుల బైఠాయించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే పోలీస్ లు ఆ ప్రాంతానికి వచ్చి కాలనీ వాసులకు సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ సిపి, పలు ప్రజాసంఘాల నాయకులు స్థానికులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు.
![]()
