Connect with us

Andhra

రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా యోగి వేమన జయంతి..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్లోనీ రెడ్డి సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులు. ఈ సందర్భంగా గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సంఘసంస్కర్తగా, రచయితగా కవిగా ఎన్నో సేవలు అందించారని, ఆ మహానీయుడిని గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ప్రభుత్వం ఆయనను గుర్తించి అధికారికంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తూ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి, రూరల్ అధ్యక్షుడు కుందూరు రమణారెడ్డి, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి, గోగిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి, రావి చెంచి రెడ్డి, గుంటక భాస్కర్ రెడ్డి, వెన్న వెంకటరెడ్డి, గోలమారి కాశిరెడ్డి, బత్తుల వెంకటరెడ్డి, కుందురు మల్లారెడ్డి, రమణారెడ్డి, బలరాం రెడ్డి, యోగి రెడ్డి, నాగిరెడ్డి, రాంరెడ్డి, రంగారెడ్డి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.