Andhra
వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా-ఏపి ఆద్వర్యంలో ‘SIR’ పై అవగాహన సదస్సు..
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం NRC ని దొడ్డిదారిలో ‘SIR’ గా పేరుమార్చి మరలా భారత మెజారిటీ ప్రజల పౌరసత్వాన్ని తొలగించే కుట్రలకు చేపట్టిన నేపథ్యంలో విజయవాడ వేదికగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా -ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు KM అబ్దుల్ సుభాన్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సుమారు 12 కోట్ల ఓటర్లను తమ ఓటుహక్కు నుండి కోల్పొయెలా పూనుకుందని, ఈ 12 కోట్ల ఓటర్లు సహజంగానే బి.జె.పి. వ్యతిరేక ఓటర్లే లక్ష్యంగా చేసుకుందని ఉండడం బహిరంగ రహస్యమేనని, SIR నిర్వహించబడిన రాష్ట్రాలలో ఇప్పటికే బి.జె.పి. వ్యతిరేక లక్షలాది ఓటర్లను తొలగించడం, అనుకూల ఓట్లను అడ్రస్ లేనివారిగా లక్షలాది ఓటర్లను చేర్చడం జరిగిందని, ఈ SIR ప్రక్రియలో పేర్లు తొలగిన వారి జాబితాలో ప్రముఖులైన నోబుల్ ప్రైజ్ గ్రహీత అమర్త్య సేన్, మాజీ నేవీ చీఫ్ వీరచక్ర అవార్డు గ్రహీత అరుణ్ కుమార్ తదితరులు ఉండటం దౌర్భాగ్యం అని ఇక సాధారణ ప్రజల పరిస్థితి అర్ధం ఏంటని ఆయన ప్రశ్నించారు..?
మన రాష్ట్రంలోను SIR ప్రక్రియ ఏప్రిల్ నెల నుండి చేపట్టేందుకు ఎన్నికల కమీషన్ సిద్ధమైందని, తన విశేషాధికారాల (సుప్రీంకోర్టుకు కూడా అతీతులు) తో చేపట్టడం గమనార్హం అని, బ్లాక్ లెవల్ ఆఫీసర్ల (BLO) పై ఓట్ల తొలగింపు గురించి ఎంతగా ఒత్తిడి తెచ్చారంటే దేశవ్యాప్తంగా సుమారు 43 మంది ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని, SIR విషయంగా ప్రముఖ సామాజిక కార్యకర్తలైన యోగేంద్ర యాదవ్, అంజలి భరద్వాజ, సదీంఖాన్, పరకాల ప్రభాకర్ లాంటి వారు హెచ్చరించారని అయన అన్నారు.
SIR దేశ ప్రజలపై ఒక ముంచుకొచ్చిన ప్రమాదమని, బి.జె.పి. వ్యతిరేక ఓటర్లను తొలగించే ఒక జాతీయస్థాయి కుట్ర మరియు బి.జె.పి. అనుకూల ఓటర్లను జాతీయ స్థాయిలో చేర్పించే ఒక ఓటు దొంగతనం అని ఆయన అన్నారు. ఈ విషయంగా ముందస్తుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలను హెచ్చరించేందుకు ప్రజా వ్యతిరేక SIR ప్రక్రియను అవగాహన పరిచేందుకు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రస్థాయి సదస్సు విజయవాడలో 08.02.2026 ఆదివారం నాడు ఉ॥ 9.00 నుండి మ॥ 2.00 వరకు ఎం.బి.వి.కె.భవన్, బందర్ రోడ్ నందు నిర్వహిస్తున్నందున ప్రజాస్వామిక, రాజ్యాంగ సంరక్షక, మైనారిటీ, దళిత, ఓ.బి.సి, గిరిజన, ప్రజాస్వామ్య వాదులందరు ఈ సదస్సులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సులో పాల్గొనదలచిన వారు ఈ ఫోన్ 96032 94465 కు సంప్రదించాలని ఆయన కోరారు.
![]()
