Connect with us

Andhra

మార్కాపురం జిల్లా DMHO గా వాణిశ్రీ బాధ్యతలు స్వీకరణ..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణిగా వాణిశ్రీ నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక కోర్టు సెంటర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నూతన జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ కృషి చేస్తారని అన్నారు. జిల్లాలోని అన్ని పిహెచ్సి సెంటర్లలో వైద్యులు ఒకరు అర తప్ప అందరూ ఉన్నారని అన్నారు. హెల్త్ క్లినిక్ల ద్వారా వైద్య సేవలు మరింత దగ్గరయ్యాయని అన్నారు.

నూతన డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ వాణిశ్రీకి డాక్టర్ కే. రాహుల్, ఎన్జీవో అసోసియేషన్ నాయకులు డి. నాగేందర్ రెడ్డి మరియు వైద్యులు బొకే, దుశ్శాలువతో అభినందనలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.