Connect with us

Andhra

మార్కాపురం షాదీ ఖాన పూర్తి చేసేది ఎప్పుడు..? డాక్టర్ మహబూబ్ వలీ ఎద్దేవా

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం నడిబొడ్డున ఉన్న షాది ఖానా నిర్మాణం ముస్లింలకు ఒక కలగానే మిగిలిపోయిందని, రెండు దశాబ్దాలు గడిచిన ఇంతవరకు పూర్తి కాకపోవడం పట్ల రాజకీయ పార్టీలు ముస్లిం మైనారిటీలకు ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అద్యక్షులు డాక్టర్ మహబూబ్ వలీ ఎద్దేవా చేశారు.

మీకోసం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం కలెక్టర్ ఆఫీసులో షాదీఖానా త్వరగా పూర్తి చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణకు వినతి పత్రం సమర్పించిన సందర్భంగా మహబూబ్ వలి మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ప్రతిపక్ష, అధికార పార్టీ యొక్క కుటిల నీతి బట్టబయలైందని, మార్కాపురం పట్టణం, చుట్టు పక్కల సుమారు 25 వేలకు పైగా ముస్లింలు నిర్వహిస్తున్నారని, 2005 నుంచి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం మే తప్ప పూర్తి చేయకుండా ముస్లింలను మోసం చేస్తున్నారని, ఇంకెప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు..?పూర్తిగా చిరకాల కల అయినటువంటి షాది ఖానా నిర్మాణం పూర్తి చేసేది ఎప్పుడు అంటూ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ షాదిఖానాకు మూడు సార్లు శంకుస్థాపన చేశారని, నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులు మారారని అయిన షాదీఖానా నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అయిందని, త్వరగా నిర్మాణం చేపట్టకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆదేశాల మేరకు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా, షేక్ ఖాసిం, షేక్ రబ్బానీ, షేక్ ఇమ్రాన్, షేక్ అల్తాఫ్, పి.కరిముల్లా తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.