Connect with us

Andhra

VB G RAM-G పధకాన్ని రద్దు చేసి MGNREGS కొనసాగించాలని ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ..

Published

on

ఒంగోలు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికీ విరుద్ధంగా తెచ్చిన VB G RAM-G చట్టానికి కి విరుద్ధంగా ఈరోజు ప్రకాశం జిల్లా ప్రధాన కేంద్రమైన ఒంగోలు పట్టణంలోనీ బాపూజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా నాయకత్వంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి విరుద్ధంగా తెచ్చిన చట్టానికి నిరసనగా నిరాహార దీక్షలో కార్యక్రమం చేపట్టారు.

ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ మహబూబ్ వలీ మాట్లాడుతూ..ఈ చట్టం పూర్తిగా గ్రామీణులను పని దినాలను దోచుకోవడమే అని, దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నందున వెంటనే దీన్ని ఆపి పాత పద్ధతిలోనే ఉన్న చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు షేక్ రెహానా బాను, మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, షేక్ అబ్దుల్లా, షేక్ ఖాసిం, షేక్ నాగూర్ భాష మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మరియు జిల్లాస్థాయి సీనియర్ నాయకులు మరియు వివిధ అనుబంధ సంస్థల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పట్టణ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.