Andhra
శ్రీనివాస ధియేటర్ మూల మలుపులో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయండి.. డాక్టర్ మహబూబ్ వలీ
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో గల బ్రహ్మంగారిమఠం, రజియా సుల్తానా మసీద్ వద్ద మూల మలుపు ఉందని వాహనాలు వేగంగా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాబట్టి ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలీ అధికారులను కోరారు. ఇటీవల కాలంలో పట్టణంలో అనేకచోట్ల స్పీడ్ బ్రేకర్లను అధికారులు వేశారని, ఈ మలుపు వద్ద కూడా స్పీడ్ బ్రేకర్లు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆయన కోరారు.
![]()
