Andhra
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా.. మాజీ ఎమ్మెల్యే అన్నా.. కార్యక్రమంలో ఎస్సీలకు దక్కని గౌరవం
మార్కాపురం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే & మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. పార్టీ కొరకు పని చేసే వారికి నేను ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తానని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని, రాబోయెది జగనన్న ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, డాక్టర్ మీర్జా షంషీర్ అలీబేగ్, డాక్టర్ మక్బుల్ భాషా, గౌస్ మొహియుద్దీన్, పట్టణ అధ్యక్షుడు సలీం, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్ర వర్గాల వారికి ఇచ్చిన గౌరవం దళితులకు ఇవ్వలేదనడానికి, జిల్లా మైనారిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కు స్టేజీపై కూర్చోబెట్టక పోవడంతో ఎస్సీలకు పార్టీ ఎంత విలువ ఇస్తుందో అర్ధం అవుతుందని కొంతమంది ఎస్సీ నాయకులు వాపోయారు.
.
![]()
