Andhra
టిడిపి కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల..
మార్కాపురం: ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పార్టీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో టిడిపి ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సంపూర్ణ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు పి ఇబ్రహీం ఖాన్, తాళ్లపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
![]()
