Andhra
జేఐహెచ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల ద్వారా MPJ -2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..
విజయవాడ: మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) రాష్ట్ర శాఖ తరపున 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ విజయవాడలోని లబ్బిపేటలో జేఐహెచ్ రాష్ట్ర ఆఫీసులో జరిగింది.
ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జేఐహెచ్ రాష్ట్ర బాధ్యులు జనాబ్ సయ్యద్ షౌకత్ ఫహిం రాష్ట్ర ప్రధానకార్యదర్శి షేక్ కరీముద్దీన్, యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి షేక్ సలీం బాషాలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఐహెచ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ షౌకత్ ఫహిం మాట్లాడుతూ.. సమాజంలో రోజురోజుకి న్యాయం, శాంతి కొరవడుతున్నాయని, అలాగే పేదలపై దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయని, మత సామరస్యం దెబ్బతింటున్న పరిస్థితి ఉందని, యంపీజే ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారని కోరారు. అలాగే న్యాయానికి యంపీజే ద్వజవాహకులుగా ఉంటూ పీడితులకు అండగా నిలుస్తుందని, ప్రస్తుతం యంపీజే చేస్తున్న కృషి అభినందనీయం అని, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కృషిని కొనసాగించాలని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యంపీజే కార్యవర్గ సభ్యులు షేక్ జావీద్, ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు సుభాష్ చంద్రబోస్, సుభాని తదితరులు పాల్గొన్నారు.
![]()
