Andhra
సాయిబాలాజి హైస్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీసాయి బాలాజీ హైస్కూల్ నందు అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పిల్లలు హరిదాసులు, కాటికాపరులు, బుడబుక్కల వేషదారణలో అలరించటం జిరిగింది. విద్యార్థులందరూ తెలుగు సంప్రదాయాన్ని ఉట్టిపడేలా ముగ్గుల పోటీలు నిర్వహంచారు. సాంస్కృతిక కార్యక్రమంలో పిల్లలు డ్యాన్సులతో అలరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం MLA నాన్న కందుల నారాయణ రెడ్డి, మాజి M.LA జంకె వెంకటరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బాల మురళీకృష్ణ, తెలుగు యువత నాయకులు కందుల రోహిత్ రెడ్డి మరియు 15వ వార్ధు ఇంచార్జీ రామాంజనేయులు పాల్గొని సాయిబాలాజి డైరెక్టర్స్ ను మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
![]()
