Connect with us

Andhra

ఇందిరమ్మ కాలనీలో మౌళిక సదుపాయాలను కల్పించండి.. డాక్టర్ మహబూబ్ వలీ

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం శివారు ప్రాంతమైన ఇందిరమ్మ కాలనీకి వెళ్లి అక్కడ సమస్యల గురించిె పర్యటించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మరియు కాంగ్రెస్ ప్రతినిధి బృందం.

ఈరోజు మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్- 2 లో పర్యటించి స్థానికుల కాలనీలో నివాసం ఉంటున్న 2000 నివాసితులు ఉంటున్నారని వారీ సమస్యలను వర్ణనాతీతంగా ఉన్నాయని వారు అన్నారు. స్వయంగా వారితో మాట్లాడి, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, కాలనీలైతే ఏర్పాటు చేశారని, మౌళిక సదుపాయాల గురించి పట్టించుకోవడమే లేదని వారు అన్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని ఇందిరమ్మ కాలనీ వాసులు ఎదుర్కుంటున్న సమస్యలు తీర్చాలని తీర్చాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, జిల్లా కార్యదర్శి సుభాని తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.