Andhra
APTF ఆద్వర్యంలో మార్పు బాలకృష్ణమ్మ సంస్మరణ సభ..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మార్కాపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మార్పు బాలకృష్ణమ్మ సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కే వి జి కీర్తి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు ఆజన్మాంతం స్మరించదగ్గ గొప్ప ఉపాధ్యాయ ఉద్యమ నేత ప్రస్తుతం మన అనుభవిస్తున్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము సాధించిపెట్టిన మహనీయుడని కొనియాడారు. మార్కాపురం జిల్లా గౌరవ సలహాదారులు Y శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు రీ గ్రూపింగ్ స్కేల్స్ సాధించి పెట్టిన ఉద్యమ నేత అని కీర్తించారు. సభాధ్యక్షులు R సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమాలకు అత్యంత విలువైన ‘ధర్నా’ ను పరిచయం చేసిన స్ఫూర్తి ప్రదాత కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాండురంగ స్వామి మాట్లాడుతూ మార్పు ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందజేయడం ఏపీటీఎఫ్ బాధ్యత అని తెలియజేశారు. జిల్లా గౌరవ సలహాదారులు ఎం బాలరాజు మాట్లాడుతూ.. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎన్నికై పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ గా ఆయన్ను కీర్తించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు D వెంకటేశ్వర్లు, శేషు కుమార్, SC కుమార్, జి పాండు, SK రఫీ, D శ్రీనివాసులు, బి జోసెఫ్, అన్వర్, ముసలయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
![]()
