Andhra
పట్టణ పోలిమేరలో కార్డన్ & సెర్చ్ నిర్వహించిన మార్కాపురం పోలీసులు..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్టేట్, ఏకలవ్య కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే ఉద్దేశంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు ఆద్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో కాలనీ మొత్తం పర్యవేక్షిస్తూ ప్రతి సందేహాస్పద కదలికను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మాదకద్రవ్యాల వినియోగం, రవాణా నివారణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ ఎస్ఐ M సైదుబాబు, గ్రామీణ ఎస్ఐ పి అంకమ్మరావు, పెద్దారవీడు ఎస్ఐలు, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని సీఐ పి సుబ్బారావు ఈ సందర్భంగా హెచ్చరించారు.
![]()
