Connect with us

Andhra

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సమాఖ్య మార్కాపురం మండల అధ్యక్షుడిగా డొక్కా లక్ష్మయ్య నియామకం..

Published

on

మార్కాపురం: ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సమాఖ్య మార్కాపురం మండల అధ్యక్షుడిగా డొక్కా లక్ష్మయ్య ను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు నూతలపాటి దేవరాజ్ (న్యాయవాది) ఆదేశాల మేరకు మార్కాపురం మండల సమాఖ్య అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగుంట్ల బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డొక్కా లక్ష్మయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సమాఖ్య మార్కాపురం మండల అధ్యక్షుడిగా నియమించిన నూతలపాటి దేవరాజ్ కి కృతఙ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతానని డా బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానంలో నడుచుకుంటానని, ఆయన ఆశయాల కోసం పని చేస్తానని దళిత బహుజన సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.