Andhra
రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించిన, MLA, RTO, MVI…
మార్కాపురం: 38వ జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా మార్కాపురం జిల్లా మండలాల మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎస్వికెపి కళాశాల నుండి కంభం కూడలి వరకు జెండాను ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బుల్లెట్ బండి నడిపి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా RTO చందన, MVI మాధవరావులు మాట్లాడుతూ.. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పేపర్లు వాహనదారులు ఉంచుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించి, తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పించెందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేసిన రవాణా శాఖ అధికారులకు అభినందించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశినాధ్, బిజెపి నాయకులు కృష్ణారావు, జిల్లా రవాణా శాఖ అధికారి చందన, డిఎస్పీ యు నాగరాజు, సీఐ సుబ్బారావు, పట్టణ, గ్రామీణ ఎస్ఐలు సైదుబాబు, అంకమరావు, మోటారు వాహన దారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]()
