Andhra
2026 సంవత్సర MPJ-AP నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..
గుంటూరు: మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ 2026 సంవత్సర నూతన క్యాలెండర్ ను గుంటూరు నగరంలోని ముఖ్యమైన ప్రజా యాక్టివిస్టులైన దక్షిణ భారత దేశ రైతు యూనియన్ నాయకులు షేక్ వాజెద్ అలీ, మేలుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ రమేష్ పట్నాయక్, జూన్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ రెడ్డిల ద్వారా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యంపీజే ఆశయాలు, లక్ష్యాలు, యంపీజే చేస్తున్న కార్యక్రమాలు వివరించిన రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్. అలాగే ప్రజా సమస్యలపై యంపీజేతో కలిసి పనిచేసెందుకు ఈ సంస్థల నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో MPJ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా, గుంటూరు జిల్లా అద్యక్షులు అడ్వకేట్ షేక్ అయ్యూబ్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్ చాంద్ బాషా ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
![]()
