Connect with us

Andhra

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన షేక్ సైదా..

Published

on

ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి షేక్ సైదాను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు కే.సి. వేణుగోపాల్ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ చెందిన 25 జిల్లాలకు అధ్యక్షులతో పాటు 16 నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఆయన కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా ఏఐసిసి నాయకులను జిల్లాలకు పరిశీలకులుగా నియమించి వారం రోజులు పాటు ప్రకాశం జిల్లాలోనీ 7 అసెంబ్లి నియోజకవర్గ కేంద్రాలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నాయకుల, పార్టీ శ్రేణులను కలిసి వ్యక్తిగతంగా ఒక్కొక్కరి అభిప్రాయాన్ని సేకరించి, ప్రస్తుతం పనిచేస్తున్న డీసీసీ అధ్యక్షుల పనితీరు, ఆశావాహుల పనితీరు, వివిధ సామాజిక వర్గాల సమతుల్యం అన్ని అంశాలను పరిశీలించి, పార్టీ నాయకులు అభిప్రాయాలను క్రోడీకరించి డిసిసి అధ్యక్షులు నియామ కానికి ఏఐసీసీ జిల్లాలకు కేటా యించిన ఏఐసిసి పరిశీలకులు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఇచ్చిన నివేదిక ఆధారంగా డిసిసి అధ్యక్షుల నియామకం జరిగింది.

ప్రకాశం జిల్లాకు ఏఐసిసి పరిశీలకునిగా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్, ఏపీసిసి నుంచి జిల్లా సమన్వయకర్తలుగా నియమింపబడిన ఏపీసిసి రాష్ట్ర డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ కే. జాన్ బాబు, ఏపీసిసి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి RM సతీష్ లు ప్రకాశం జిల్లాలో గత సంవత్సరం నవంబర్ 26వ తారీకు నుండి డిసెంబర్ 2 వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా సారధ్యంలో ఒంగోలు, కొండేపి, కనిగిరి, దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సమావేశాల్లో నూటికి 95 శాతం మంది ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ సైదాను తిరిగి అధ్యక్షుడిగా కొనసాగించాలని కోరిన మీదట అలాగే సైదా డిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యత చేపట్టి 14 నెలల కాలంలో జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కార్యక్రమాలను , పార్టీ సంస్థగత నిర్మాణానికి చేసిన కృషి, నిత్యం ప్రజలతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగడుతూ చేసిన ఉద్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నిత్యం డిబేట్లో పాల్గొంటున్న పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజా సమస్యలపై గల మెత్తుతున్న షేక్ సైదా కార్యదీక్షను పరిగణలోకి తీసుకొని ఆయనను తిరిగి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా షేక్ సైదా రెండో పర్యాయం ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, కేకేసి రాష్ట్ర చైర్మన్ కైపు వెంకట కృష్ణారెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజ్, సంత నూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త పసుమర్తి సుధాకర్, మేడబలిమి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మన్నం ప్రసన్మన్న రాజు, కేకేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ వర్మ, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ అలీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనాబాను, జిల్లా బీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ సుబ్బారావు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ సుబ్బారావు, బొడ్డు సతీష్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శేఖర్ రసూల్, గోరంట్ల కోటేశ్వరరావు, కాకర్లపూడి వేణు, ప్రధాన కార్యదర్శలు, విరినేని వెంకట నర్సయ్య, మధు, ప్రసాద్ వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు మండల పార్టీ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ క్యాడర్ అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.