Connect with us

Andhra

37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా డ్రైవర్ లకు అవగాహన కల్పించిన MVI మాధవరావు..

Published

on

మార్కాపురం: 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవం 30 రోజులపాటు అనగా 01-01-2026 నుండి 31-01-2026 వరకు శిక్షణతో భద్రత సాంకేతిక ద్వారా పరివర్తన నినాదంతో ఆదివారం 04-01-2026 నాడు మార్కాపురం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ మరియు కారు స్టాండ్ నందు మార్కాపురం జిల్లా రవాణా శాఖ అధికారి కుమారి చందన ఆదేశాల మేరకు ఆటో మరియు కారు స్టాండ్ డ్రైవర్ల కి ప్రమాదాలు వాటి నివారణ, రహదారిపై మన బాధ్యత గురించి ఆటో డ్రైవర్ల మరియు కారు డ్రైవర్స్ కి చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డ్రైవర్లకి

ఓవర్ స్పీడు వెళ్లకుండా, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం మత్తు పదార్థాలు సేవించకుండా, డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కవారితో మాట్లాడకుండా రోడ్డుపై నిరంతరం మన దృష్టిని ఉంచాలని ప్రతి డ్రైవర్ రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మన కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలని ఈ ప్రమాదంలో ఏదైనా జరిగిన ఎడల మన కుటుంబం నష్టపోతుందని, ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా RC, ఇన్సూరెన్స్, పొల్యూషన్ మరియు ప్రతి డ్రైవర్ కు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ. మాధవరావు అవగాహన కల్పించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.