Connect with us

Andhra

MGG ఉపాధి పధకాన్ని యథాతథంగా కొనసాగించాలి.. కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

Published

on

మార్కాపురం: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పన కోసం ఏర్పాటుచేసిన నారేగా పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ.. నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అధ్యక్షతన మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ.. 20 సంవత్సరాల క్రితం గ్రామీణ చిన్న , సన్నకారు రైతులకు, బడుగు బలహీన వర్గాలు వలసల బాట పట్టకుండా వారికి ఉపాధి కల్పించడం కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపిలో ప్రారంభించారని, దాని వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాదిమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని అలాంటి మహోన్నత పథకాన్ని మహాత్మా గాంధీ పేరుని తొలగించి విబిజి రాంజీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొని రావడం ఎన్డీఏ కూటమి దివాలా కోరుతనానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. కొత్త చట్టాన్ని రద్దు చేసే వరకు అన్ని పక్షాలతో కలిసి ఉద్యమిస్తామని సైదా తెలిపారు.

యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, సిపిఐ సీనియర్ నాయకులు అందే నాసరయ్య, ఆప్ జిల్లా అద్యక్షులు వి సుదర్శన్, సిపిఎం నాయకులు బాల రంగయ్య, లోక్ సత్తా జిల్లా అద్యక్షులు చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ అలీ, విసికె పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్ రాజులు మాట్లాడుతూ.. పేదల పొట్టకొట్టే ఇలాంటి నల్ల చట్టాలను అందరూ సమిష్టిగా వ్యతిరేకించాలని, బీజేపీ నియంతృత్వ పాలనలో ప్రతిపక్ష నేతలను అనేకమందికి జైలుకు పంపించిన ఘనత మోడీ అమిత్ షాదేనని రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని, ఎన్డీఏ కూటమి 12 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని అదానీ అంబానీలకు ఈ దేశ సంపదను దోచి పెడుతున్నారని, బిజెపి పాలనలో వర్గ వైశ్యామ్యాలు, విద్వేష రాజకీయాలు చేస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేసిందని, బీజేపీ హయాంలో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకమై నిరంకుశ మోడీని గద్దె దించాలని అన్నారు.

ఈ రోజు దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, సిపిఎం పట్టణ అధ్యక్షులు ఏడుకొండలు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి షేక్ ఖాసీం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనాబాను, సిఐటియు జిల్లా అధ్యక్షులు రూబెన్, ఎంపిజే అధ్యక్ష, ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, సయ్యద్ మస్తాన్ వలి, తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కాపురం పట్టణ అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్లా, ఖాసిం, ఇమ్రాన్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.