Andhra
నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించిన జవాన్లు..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘ భవనంలో గురువారం జవాన్లు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనతోటి మాజీ సైనికులతో కలిసి స్నేహపూర్వక వాతావరణంలో నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడికి కేక్ తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం అంకితభావంతో సేవలందించిన మాజీ సైనికుల త్యాగాలు అమూల్యమని కొనియాడారు. సమాజం వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకొని, వారికి తగిన గౌరవం మరియు సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించారు.
![]()
