Andhra
జర్నలిస్టులకు డైరీలు పంపిణీ చేసిన ఏ1 గ్లోబల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ షంషీర్ అలీబేగ్..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురంలో ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో న్యూ ఇయర్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కోర్టు కూడలి వద్ద మొఘల్ గెస్ట్ హౌస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు తన చేతులతో జర్నలిస్ట్ మిత్రులకు డైరీ లు, క్యాలెండర్ లు పంపిణీ చేశారు. అనంతరం షంషీర్ అలీబేగ్ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో APUWJ జిల్లా అద్యక్షులు NV రమణ, APUWJ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూల అల్లూరి రెడ్డి, సీనియర్ జర్నలిస్టు GL నరసింహ రావు ఆద్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా NV రమణ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జర్నలిస్టులకు డైరీలు, క్యాలెండర్లను అందజేస్తున్న ఏ1 గ్లోబల్ కళాశాలల అధినేత డాక్టర్ షంషీర్ అలీబేగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, లాయర్లు, వైఎస్సార్ సీపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ విందు ఏర్పాటు చేశారు.
![]()
