Andhra
ప్రజాభీష్టానికి పాలకులు ఇచ్చే గౌరవం ఇదేనా?.. విద్యావంతుల మరియు మేధావుల వేదిక
మార్కాపురం: జిల్లాల ఏర్పాట్లలో ప్రజాభీష్టాన్ని, కొత్త అభ్యంతరాలను కోరిన ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను చేర్చకపోవడంపై పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మరియు మేథావుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.
పాలకులు తమ అభీష్టానికి లేదా రాజకీయ లబ్ది కోసం జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లా సరిహద్దుల నిర్ణయం చేయడమేమిటని ప్రశ్నించారు..? మొదట ప్రజాభీష్టం ప్రకారం దొనకొండ, కురిచేడు మండలాలను కలుపుతున్నట్లు ప్రకటించి, అనంతరం ఆ రెండు మండలాలను తొలగించడం ఎంతవరకు భావ్యం? ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి వ్యవహరించినట్లు భావిస్తున్నాం. దర్శితో కూడిన ఐదు నియోజకవర్గాలను కలిపి ఈ పశ్చిమ ప్రాంతాన్ని జిల్లాగా చేయమని ఈ ప్రాంతీయులు కోరగా, గత ప్రభుత్వ పాలకులు చేయలేకపోతే ఈ పాలకులు కొత్తజిల్లాగా భావించినట్లుగా, దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశంజిల్లాలో కలిపి అన్యాయంగా ఉండేలాగా, దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాలు లేని మార్కాపురం జిల్లా ఏర్పాటు వల్ల ఈ వెనుకబడిన నాలుగు నియోజకవర్గాలకు ప్రయోజనం ఏమిటి? యర్రగొండపాలెం, గిద్దలూరు, ప్రాంతాలు నల్లమల అడవులు, కనిగిరి ప్రాంతం ఫ్లోరిన్ తోను, కొండరాయి తప్ప ఏమిలేదని, ఇక మార్కాపురం నియోజకవర్గంలో పలకల పరిశ్రమ, అ తర్వాత ఉన్న డిజైన్ స్లెట్ పరిశ్రమల పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం కానీ ప్రయివేట్ భూమి విస్తారంగా లేని పరిస్థితి ఉందని అన్నారు. అంతేగాక, పాడిపంటలకు అనువైన భూమి లేని ఈ ప్రాంతాన్ని జిల్లా చేస్తే ఎలాంటి ప్రయోజనం ప్రజలకు ఉంటుందా అని ప్రశ్నించారు..?
మార్కాపురం నియోజకవర్గానికి కేవలం 20కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండలో రైల్వేజన్షన్ మరియు బ్రిటీష్ కాలంనాటి విమానాశ్రయం మరియు ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు, పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన దొనకొండను, ఆ ప్రక్కనే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురిచేడును కూడా మార్కాపురం జిల్లాలో కలపడం లేదని ఆయా మండల పరిషత్‌లు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం గజిట్ పబ్లికేషన్ ఇచ్చేనాటికైనా మార్కాపురం జిల్లాలో దొనకొండ, కుర్చేడు మండలాలు కలపాలని కోరుతున్నామని వారు కోరారు.
![]()
