Connect with us

Andhra

మార్కాపురం డివిజన్ పరిధిలోని విద్యా సమిక్ష నిర్వహించిన అడిషనల్ డెరైక్టర్ సుబ్బారెడ్డి..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజక వర్గాల వారీగా విద్యా సమీక్షా సమావేశం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి ఎం.శ్రీనివాసులు అధ్యక్షతన, డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలలొని మండలాల వారీగా ప్రభుత్వ యాజమాన్యంలోని 144 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, సిఆర్ఎంటి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పదో తరగతి విద్యార్థులకు సంబంధించి 100 రోజుల ప్రణాళిక, ప్రాథమిక పాఠశాల స్థాయి జి-ఎఫ్.ఎల్.ఎన్ అంశాల అమలుతీరుపై అంశాల వారిగా సమీక్ష నిర్వహించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదో తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు అంశాల వారీగా రెమీడియల్ సెషన్స్.. ఎసెస్మెంట్ నిర్వహించాలని, దానికి అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషిచేసి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించి, ఉత్తమ ఫలితాలు సాధించేలాగున కృషి చేయాలని ఆయన కోరారు.

మండలాల వారీగా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాఠశాల వారీగా రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్, మరియు స్లిప్ టెస్ట్ ల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉత్తమ ఫలితాలు సాధించిన వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ సమావేశంలో డి.సి.ఈ.బి సెక్రటరీ ఎం. శ్రీనివాసులు, ఓంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్, మార్కాపురం మండల విద్యాధికారి యం.రాందాస్ నాయక్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు సిఆర్ఎంటిలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.