Andhra
నేటి నుంచి మార్కాపురం నూతన జిల్లాగా ఆవిర్భావం.. బాధ్యతలను స్వీకరించిన కలెక్టర్
మార్కాపురం: నూతన మార్కాపురం జిల్లా మొదటి కలెక్టర్ గా పి. రాజాబాబు బాధ్యతలను స్వీకరించారు. పండుగ వాతావరణంలో మేళతాళాలతో మార్కాపురం జిల్లా ఆవిర్భావం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణ శివారులోని ఆర్ & ఆర్ కాలనీలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, కూటమి నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా ఇన్చార్జి కలెక్టర్ కు బాణసంచా, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు, అధికారులు. అన్ని మతాల పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల ఆకాంక్షను సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చినట్లు తెలిపారు.
![]()
