Connect with us

Andhra

తల లేని మొండెంలా మార్కాపురం నూతన జిల్లా.. షేక్ సైదా హాట్ కామెంట్స్

Published

on

ఒంగోలు: కొత్త జిల్లాల ఏర్పాట్లలో రాజకీయ పోకడ శ్రుతి మించి, ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి, అధికార పార్టీకి తలొగ్గేలా ఉందని మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్, APCC అధికార ప్రతినిధి షేక్ సైదా దుయ్యబట్టారు. ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఆయన మాట్లాడుతూ.. సమైక్యంగా 65 రోజులపాటు సుదీర్ఘ పోరాట ఫలితంగా జిల్లాను సాధిస్తే, నేడు తల లేని మొండెంలా? నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు..? ఐదు అసెంబ్లీ నియోజ కవర్గాలతో కూడిన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికలను సమయంలో వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల తోనే! జిల్లా ఏర్పాటు చేయడం.. అందులో దర్శి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో కలపడం చంద్రబాబు, లోకేష్, గొట్టి పాటిలా కుటిల నీతికి నిదర్శనంగా నిలుస్తోందని విమర్శించారు.

కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో జగన్ను మించి చంద్రబాబు వ్యావహారిస్తున్నారని, పూర్తిగా వెనకబడ్డ, ఎటువంటి అభివృద్ధి లేని అటవీ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజక వర్గాలతో కలిపి నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం, పశ్చిమ ప్రాంత ప్రజల ఆగ్రహానికి ఎన్డీఏ కూటమి గురికాక తప్పదని హెచ్చరించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ ప్రాంత ప్రజల తడాఖాన్ని చూపించబోతున్నారని, 54,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా దొనకొండ ప్రాంతం, అలాగే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో ఉండి ఉంటే పరిశ్రమలు ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించేది, అభివృద్ధి సాధించేదని, అలా కాకుండా పూర్తిగా వెనకబడ్డ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి, ఇది మేము సాధించిన ఘనతని అధికార పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం, పాలాభిషేకాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.