Andhra
మార్కాపురం జిల్లా చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. నూతల పాటి దేవరాజ్
మార్కాపురం: పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ మార్కాపురం జిల్లా కు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని మార్కాపురం జిల్లా పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నూతల పాటి దేవరాజ్ సోమవారంన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా నూతలపాటి దేవరాజ్ మాట్లాడుతూ.. వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా కావాలనే లక్ష్యంతో 2011 వ సంవత్సరంలో మార్కాపురం జిల్లా పోరాట సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అప్పటినుండి జిల్లా కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల గొంతుకను ప్రభుత్వాలకు వినిపించేలా చేశామని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాకు ఆమోదముద్ర వేయడం హర్షించదగ్గ నిర్ణయమని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు విద్య, ఉపాధి అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఇకపై మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పెద్దఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రానున్నాయని, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పడి యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
పారిశ్రామిక అవకాశాలు అధికంగా ఉన్న దొనకొండ, కురిచేడు మండలాలను నూతన జిల్లాలో కలిపితే ఇంకా ఈ నూతన జిల్లా అభివృద్ధి చెందేదని ఆశాభావం వ్యక్తపరిచారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
![]()
