Connect with us

Andhra

దొంగతనాల రికవరీ చేసినందుకు జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎస్ఐ M సైదుబాబు..

Published

on

ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జరుగుతున్న దొంగతనాల రికవరీ విషయంలో మార్కాపురం ఎస్ఐ M సైదుబాబు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ రోజు ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన పోలీస్ అధికారులకు అవార్డులను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చారు.

ఈ సందర్భంగా మార్కాపురంలో డ్యూటీలో చేరక మునుపు అధిక సంఖ్యలో ఉన్న కేసులను పట్టణ ఎస్ఐ M సైదుబాబు చాలా వరకు తగ్గించారు. అలాగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించి నూతన టెక్నాలజీతో తన సిబ్బందితో నిరంతరం కృషి చేసి పెద్ద మొత్తంలో బంగారం, నగదు, వెహికల్స్ రికవరీ చేశారు. దీంతో పట్టణ వాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో దొంగతనం చేయాలంటేనే భయం కలిగేలా నిఘా వ్యవస్థను పెంచి మంచి ఫలితాలు సాధించి జిల్లా ఎస్పీ ద్వారా అవార్డు ను పొందారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.