Andhra
IYM మత్తు పదార్ధాల వ్యతిరేక ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించిన M ఎస్ఐ సైదుబాబు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్ఐ M సైదు బాబు, రుయా హాస్పిటల్ డాక్టర్ దస్తగిరిల చేత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ఐడియల్ యూత్ మూమెంట్ (I.Y.M) నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త మద్యపాన నిషేధ ఉద్యమం “ఒకే జీవితం – ఒకే అవకాశం” అనే నినాదంతో ఈ నెల డిసెంబర్ 22 నుండి 31 దాకా నిర్వహిస్తుందని, మద్యం మత్తు పదార్థాల మత్తులో యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మరియు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వాపోయారు. అలాగే నేటి యువత భవిష్యత్తులో భారతదేశానికి వెన్నుముక లాంటిదని, అలాంటి యువత మత్తుకు బానిసై తమ భవిష్యత్తును, తల్లిదండ్రుల కలలను మరియు దేశ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సయ్యద్ ఆష్రఫ్ అలీ, పట్టణ అధ్యక్షులు సికిందర్, జమాత్ సభ్యులు మాలిక్ భాష, I.Y.M జిల్లా బాధ్యులు తలహా, పట్టణ అధ్యక్షులు రసూల్ మరియు రఫీ, ఖాసీం భాష, యూనుస్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
