Andhra
వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు..
విజయవాడ: వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ముజ్తబా ఫారూఖ్, పార్టీ ఇన్చార్జ్ హబీబుల్లాఖాన్ లు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఈ సమావేశం ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ సమస్యలతో పాటు పార్టీ అంతర్గత సమస్యలను చర్చించి ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడమైంది.
1. డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా ఫ్యాసిస్ట్ శక్తులు దేశవ్యాప్తంగా చర్చిలపై దాడులు చేసి క్రైస్తవ సోదరులకు వారి ప్రార్థనలకు అంతరాయం కలిగించే దుశ్చర్యలను సమావేశం ఏకగ్రీవంగా ఖండించింది. 2. ఆరావళి పర్వతాలను రక్షించుకోవడానికి కదిలిన పదిలక్షల పౌర సమాజానికి రైతులకు పర్యావరణ పరిరక్షకులకు సమావేశం జేజేలు పలికింది. 3. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై భారత దేశంలో మైనారిటీపై ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా మైనారిటీలపై జరిగే దాడులు మానవ హక్కులకు వ్యతిరేకమని తక్షణమే ప్రభుత్వాలు వీటిపై స్పందించి మైనారిటీల సాంస్కృతిక మతపర భాషాపర హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ కరీంని రాష్ట్ర అధ్యక్షులు KM అబ్దుల్ సుభాన్ నియమించారు. ఈ కార్యక్రమంలో పలువురు వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
![]()
