Andhra
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిన మార్కాపురం కాంగ్రెస్ పార్టీ..
మార్కాపురం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి 141 సంవత్సరాలైన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గడియారం స్తంభం సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మెనుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి ఆనందాన్ని వ్యక్తం పరిచారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, తర్లపాడు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ రెహానా బాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా, షేక్ ఖాసిం, షేక్ రబ్బానీ, ఇమ్రాన్, షేక్ అల్తాఫ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
