Connect with us

Andhra

హానరబుల్ ఫౌండేషన్ తరఫున సెల్యూట్ ఎచీవర్స్ అవార్డు పొందిన డాక్టర్ షేక్ మహబూబ్ వలీ..

Published

on

న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలికి సెల్యూట్ ఎచీవర్స్ హానరబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక సెల్యూట్ ఎచీవర్స్ అవార్డు లభించింది.

న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, హనీ బీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన డాక్టర్ రామ్ చందర్ సింగ్, మిస్ ఇండియా గ్లోబల్ దీప్తి తతోరియా మరియు ప్రముఖ బౌద్ధ మత గురువు సంయుక్తంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలికి అవార్డును అందజేశారు. అవార్డుతో పాటు ప్రత్యేక డాక్టరేట్ ను కూడా ప్రదానం చేశారు.

సమాజంలో మార్పు కోసం డాక్టర్ షేక్ మహబూబ్ వలి చేస్తున్న నిరంతర సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, సర్టిఫికెట్లు మరియు డాక్టరేట్ పట్టాలు పొందడం విశేషం. ఇటీవలే ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ద్వారా భారతదేశ ఉపాధ్యక్షులుగా డాక్టర్ షేక్ మహబూబ్ వలికి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, కరప్షన్ ఫ్రీ ఇండియా, యోగ్దాన్ సహరాసమితి సంస్థల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ అవార్డు ఆయన సేవలకు మరింత గుర్తింపుగా నిలిచిందని పలువురు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.